విమానంలో లైంగిక వేధింపులకు దిగిన పెద్దమనిషి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో లైంగిక వేధింపులకు దిగిన పెద్దమనిషి!

రెండు గంటల ప్రయాణంలో లైంగిక వేధింపుకు దిగాడో కామాంధుడు. ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ఇండిగో ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానంలో ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన రమేష్ చంద్ (56) అనే వ్యక్తి ప్రయాణిస్తున్నారు. పక్కసీట్లో ఒక మహిళ కూర్చున్నారు. ఆమెను తాకేందుకు ప్రయత్నించడమే కాకుండా, బయటకు చెప్పుకోలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఎయిర్ హోస్టెస్ ను పిలిచి, సీటు మార్పించుకుంది. విమానం ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్ కాగానే పైలట్ ఇచ్చిన సమాచారంతో ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News