మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెంగల వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ఆయనతో పాటు మరో 15 మందికి కూడా ఇదే శిక్షను విధించింది. మరో ఐదుగురికి రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. శిక్ష పడినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.

కేసు వివరాల్లోకి వెళ్తే, పదేళ్ల క్రితం (2007లో) నక్కపల్లి మండలం బంగారమ్మపాలెం బీఎంసీ కంపెనీ (కెమికల్ ఫ్యాక్టరీ) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారుడు కోశాల కొండ మృతి చెందాడు. ఈయన మృతికి చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమని కేసు దాఖలైంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు నేడు వెలువరించింది. వెంకట్రావు సహా 16 మందికి జీవితఖైదును విధిస్తూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 

More Telugu News