కేంద్ర పర్యావరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర పర్యావరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్‌

కేంద్ర మంత్రి అనిల్‌ మాధవ్‌ దవే మృతి చెంద‌డంతో ఖాళీ అయిన పర్యావ‌ర‌ణ శాఖను కేంద్ర ప్ర‌భుత్వం... శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రిగా ఉన్న హర్షవర్థన్‌కు అప్ప‌గించింది. ఈ రోజు హర్షవర్థన్ ఆ శాఖ మంత్రిగా అద‌న‌పు బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖ‌ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ హ‌ర్ష‌వ‌ర్థ‌న్.. అనంత‌రం అనిల్‌ దవే స్మారకార్థం త‌మ కార్యాల‌య‌ ప్రాంగణంలో మొక్క నాటారు.
అనిల్‌ దవే త‌న‌ మరణానంతరం ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయరాదని తన వీలునామాలో రాశారు. దీంతో ఆయ‌న‌కు సంబంధించిన విగ్ర‌హాలు పెట్ట‌డం లేదు. అనిల్ దవేకు గుర్తుగా ఓ మొక్కను నాటితే ఆయ‌న ఆత్మ‌ ఎంతో సంతోషిస్తుంద‌ని హర్ష‌వర్థ‌న్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.           

More Telugu News