Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను బాగా రొమాంటిక్... అప్పుడు రాసిన ప్రేమ లేఖలు ఇంకా భద్రంగా ఉన్నాయి: ఏబీ డివిల్లీర్స్

అంతర్జాతీయ క్రికెట్ లో సఫారీ క్రికెటర్ ఏబీ డివిల్లీర్స్ ను 360 డిగ్రీస్ ఆటగాడని అంటుంటారు. మైదానంలో 360 డిగ్రీలలో ఏ డిగ్రీలో అయినా షాట్ కొట్టగల సామర్థ్యం అతని సొంతం. ముంబైలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా డివిల్లీర్స్ ముంబైలోని ఓ పాఠశాలకు వెళ్లాడు. ఈ సందర్భంగా తన స్కూల్ డేస్ ను గుర్తు తెచ్చుకున్నాడు. తన స్కూల్ డేస్ లో తాను బాగా రొమాంటిక్ అన్నాడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు...ప్రేమ పొంగుకొచ్చేదని, దీంతో కవిత్వం రాసేవాడినని అన్నాడు.

అయితే, అమ్మాయిని చూడగానే రొమాంటిక్ పోయెట్రీ రాసినా...స్వతహాగా సిగ్గరిని కావడంతో ఆ ప్రేమలేఖను మాత్రం వారికి ఇచ్చేవాడిని కాదని గుర్తు చేసుకున్నాడు. అలా రాసిన ఓ 30 ప్రేమ లేఖలు ఇప్పటికీ తన ఇంటి అటకపై ఉన్నాయని తెలిపాడు. ఇప్పుడు తన భార్య డానిలీకి ప్రేమ లేఖలు రాస్తుంటానని చెప్పాడు. తాజాగా ఇంటికి వెళ్లిన భార్య పాస్ పోర్ట్ లో ఒక ప్రేమ లేఖ పెట్టానని, రెండు రోజుల తరువాత దానికి ఎస్సెమ్మెస్ రూపంలో జవాబు వస్తుందని తెలిపాడు.

More Telugu News