ఆయురారోగ్యాలతో చంద్రబాబు బాగుండాలి: కేసీఆర్ ఆకాంక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయురారోగ్యాలతో చంద్రబాబు బాగుండాలి: కేసీఆర్ ఆకాంక్ష

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పుట్టిన రోజు శుభాభినందనలు తెలియజేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేసీఆర్ పంపిన శుభాకాంక్షలను అందుకున్న చంద్రబాబు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతకాలం గడిచినా, తెలుగు ప్రజలు ఒకటిగా కలిసుండాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, హైదరాబాద్ లో బాబు జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకలకు తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, రావుల, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో కార్యకర్తలు రక్తదానం చేశారు.

More Telugu News