సోనియా నివాసం వద్ద సిక్కుల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా నివాసం వద్ద సిక్కుల ఆందోళన

కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ను 1984 సిక్కుల ఊచకోత కేసులో నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించడంపై సిక్కుల ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసం 'టెన్ జన్ పథ్' ఎదుట సిక్కులు ఈ ఉదయం ఆందోళన నిర్వహించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు సరబ్ జిత్ సింగ్ మృతికి నిరసనగా ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట సిక్కులు ర్యాలీ నిర్వహించారు.

More Telugu News