విశాఖలో జనసేన కార్యకర్తల మౌనదీక్ష భగ్నం.. అరెస్టులు.. కార్యకర్తల ధర్నా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో జనసేన కార్యకర్తల మౌనదీక్ష భగ్నం.. అరెస్టులు.. కార్యకర్తల ధర్నా!

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జనసేన పార్టీ కార్యకర్తలు విశాఖ పట్టణంలోని జగదాంబ సెంటర్ లో మౌనదీక్షకు దిగారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు దీక్షా స్థలిని అక్కడి నుంచి మార్చుకోవాలని సూచిస్తూ... దీక్షను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి, విశాఖ టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో, వారిని విడుదల చేయాలంటూ జనసేన పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

More Telugu News