Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక చేతిలో కత్తి..మరో చేతితో అలీ చేయిని పట్టుకున్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కానుకగా బంగారు పూత పూసిన కత్తిని నటుడు శివ బాలాజీ అందజేశాడు. ‘కాటమరాయుడు’ సెట్స్ లో ఈ కత్తిని అందుకున్న పవన్ పక్కన నటుడు అలీ, చిత్ర బృందంలోని వారు ఉన్నారు. కత్తిని తనదైన శైలిలో తిప్పిన పవన్, ఆ తర్వాత... పక్కనే ఉన్న అలీ చేతిని తన చేతిలోకి తీసుకుని దానిపై కత్తిని ఉంచాడు. దీంతో, అలీ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ కు పవన్ సహా చిత్ర బృందంలోని సభ్యులు కడుపుబ్బ నవ్వారు. 

More Telugu News