శేఖ‌ర్‌బాబు మృతిప‌ట్ల చిరంజీవి, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, అర్జున్ సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేఖ‌ర్‌బాబు మృతిప‌ట్ల చిరంజీవి, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, అర్జున్ సంతాపం

హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో ఈ తెల్లవారు జామున ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతిప‌ట్ల మెగాస్టార్‌ చిరంజీవి, కె.రాఘవేంద్ర రావు, నిర్మాత‌ అల్లు అరవింద్, న‌టుడు అల్లు అర్జున్, దర్శకుడు రాఘవేంద్ర రావుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు శేఖర్ బాబు నివాసానికి వ‌చ్చిన స‌ద‌రు సినీ ప్ర‌ముఖులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ఆయ‌న‌ మృతదేహానికి నివాళులర్పించారు. శేఖ‌ర్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికాలో ఉన్న కుమార్తె రాగానే ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

More Telugu News