తొలిసారి మంచి నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలిసారి మంచి నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్!

వివాదాస్పద నిర్ణయాలతో జనాలకు దడ పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. లింగ మార్పిడి చేయించుకున్న విద్యార్థులు వారికి మాత్రమే కేటాయించిన బాత్ రూమ్ లు, లాకర్ రూమ్ లను ఉపయోగించుకునే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అందరు విద్యార్థుల్లాగానే ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు కూడా బాత్ రూమ్ లు, లాకర్ల విషయంలో సమాన హక్కులు ఉండాలని ఆయన అన్నారు. గతంలో ట్రాన్స్ జెండర్స్ కు ప్రత్యేక గదులు, లాకర్స్ ఉండేలా ఒబామా ప్రభుత్వం ఓ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనతో ట్రాన్స్ జెండర్లు, వారి కుటుంబీకులు ఎంతో ఆవేదన అనుభవించారు. ట్రంప్ నిర్ణయంతో వారందరిలో సంతోషం నెలకొంది. ఇకపై విద్యాసంస్థల్లో ఎలాంటి లింగ వివక్ష ఉండదని వారు అంటున్నారు. 

More Telugu News