ఆ సంఘటన చూసి చిరంజీవి, రాఘవేంద్రరావు షాకయ్యారు: శాంతి శ్రీహరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సంఘటన చూసి చిరంజీవి, రాఘవేంద్రరావు షాకయ్యారు: శాంతి శ్రీహరి

1992లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఘరానా మొగుడు షూటింగ్ సమయంలో తన నడుంపై గిల్లేసిన ఒక వ్యక్తిని చితక్కొట్టేశానని డ్యాన్సర్ శాంతి శ్రీహరి (డిస్కోశాంతి)  చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘వైజాగ్ లోని హార్బర్ లో ‘బంగారు కోడి పెట్ట.. వచ్చెనండి..’ అనే పాట షూటింగ్ జరుగుతున్న సమయం అది. షాట్ రెడీ అనగానే.. చిరంజీవి గారు రాగానే అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టేశారు. నేను ఆరెంజ్ కలర్ స్కర్ట్ వేసుకుని ఉన్నాను. ఆ షాట్ అయిపోగానే పైన ఓ క్లాత్ కప్పుకుని నడిచి వెళుతుంటే.. సుమారు పదిహేను మంది ఉన్న ఓ గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లలో ఒకడు నా నడుంపై గిల్లాడు. అంతే, వాడి చెయ్యి పట్టుకుని ముందుకు లాగి చితక్కొట్టుడు కొట్టాను.. కింద పడేసి కాళ్లతో తొక్కి పారేశాను. ఇది చూసి, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు షాకయ్యారు. వెంటనే, వాళ్లు వచ్చి, చెరో వైపు నన్ను పట్టుకుని తీసుకువెళ్లిపోయారు’ అని నాటి సంఘటనను దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి శ్రీహరి గుర్తు చేసుకున్నారు. 

More Telugu News