అమ్మాయి క‌నిపిస్తే ముద్దు పెట్టాల‌ని బాలయ్య అన్నారు..టీడీపీ నేత‌లు ఆడ‌వారి ప‌ట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు!: రోజా విమర్శలు

07-02-2017 Tue 12:23 | Both States
టీడీపీ నేత‌ల‌పై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాల్ మ‌నీ రాకెట్లు రాష్ట్రానికే సిగ్గుచేట‌ని అన్నారు. అలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్న‌ నిందితుల‌ని ఏమీ అన‌కుండా చంద్ర‌బాబు సర్కారు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. త‌న‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి బ‌య‌ట‌కు నెట్టేశార‌ని ఆమె అన్నారు.

తెలుగు దేశం పార్టీ తెలుగు దుర్యోధ‌నుల పార్టీలా మారిందని ఆమె ఆరోపించారు. భార‌త మాత గుండెల‌పై న‌డిచే ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదని, తెలుగు త‌ల్లి ఒడిలో ఉండే తెలుగు ఆడ‌ప‌డుచుల‌కు ర‌క్ష‌ణ లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆడ‌వారిపై అరాచ‌కాలు జ‌రుగుతున్నాయని, వారిని అడ్డంగా తొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు. మ‌హిళా పార్ల‌మెంటు స‌ద‌స్సులో చంద్ర‌బాబు నాయుడికి మాట్లాడే అర్హ‌త లేద‌ని ఆమె అన్నారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌రువాతే అక్క‌డ చంద్ర‌బాబు నాయుడు  అడుగుపెట్టాలని రోజా డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేస్తాన‌ని, ఆడ‌వారి జీవితాల్లో వెలుగులు నింపుతాన‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అక్క‌డ‌కు వ‌స్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. అమ్మాయి క‌నిపిస్తే ముద్దు పెట్టాల‌ని, క‌డుపు చేయాల‌ని చంద్ర‌బాబు బావ‌మ‌రిది బాల‌య్య అన్నారని రోజా మండిప‌డ్డారు. టీడీపీ నేత‌లు ఆడ‌వారి ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆమె ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌ను వేధించిన‌ రావెల కిషోర్ బాబుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఆడ‌వారిని అంగ‌ట్లో బొమ్మ‌ల్లా చూస్తున్నారని ఆమె అన్నారు. టీడీపీ తీరు ఎంతో మంది ఆడ‌పిల్ల‌ల చావుకి కార‌ణ‌మ‌వుతోందని మండిప‌డ్డారు.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more