కోస్ట్ గార్డ్ నుంచి రూ. 916 కోట్ల కాంట్రాక్టు పొందిన అనిల్ అంబానీ

30-01-2017 Mon 13:07 | Business
భారత తీర ప్రాంత రక్షక దళం నుంచి అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ రూ. 916 కోట్ల విలువైన భారీ కాంట్రాక్టును పొందింది. ఈ విషయంపై రిలయన్స్ డిఫెన్స్ సంస్థ నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. 14 పెట్రోల్ ఓడల నిర్మాణం నిమిత్తం ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అనిల్ అంబానీ వెల్లడించారు. 14 మీడియం, హై స్పీడ్ నౌకలను ఇండియన్ కోస్ట్ గార్డ్ కు అప్పగించనున్నామని ఆయన తెలిపారు. యాంపీ పైరసీ, రెస్క్యూ ఆపరేషన్స్, నిఘా తదితర అవసరాలకు వీటిని వాడవచ్చని, మాడ్యులర్ నిర్మాణ సాంకేతికతతో వీటిని నిర్మిస్తున్నామని అనిల్ అంబానీ తెలిపారు.

కాగా, ఈ డీల్ కోసం లార్సన్ అండ్ టుబ్రో, కొచ్చిన్ షిప్‌ యార్డ్‌,  గోవా నౌకా నిర్మాణ కేంద్రం,  గార్డెన్ రీచ్ షిప్‌ బిల్డర్స్‌ అండ్ ఇంజనీర్స్ తదితర సంస్థలు కూడా బిడ్లను దాఖలు చేయగా, రిలయన్స్‌ డిఫెన్స్ కు ఆర్డర్ లభించడం గమనార్హం. ఓ ప్రైవేటు రంగ షిప్ యార్డు సంస్థతో ప్రభుత్వం ఈ తరహా డీల్ కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడంతో రిలయన్స్ డిఫెన్స్ వాటాలకు నేటి మార్కెట్ సెషన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సంస్థ ఈక్విటీ వాటా ఏకంగా 6 శాతం పెరిగింది.

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more