Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కొడుకులైనా సరే.. అమ్మాయిలను వేధిస్తే త‌ల‌లు తీసేస్తా!: షారుక్ ఖాన్‌

ఇటీవ‌ల‌ బెంగళూరులో జ‌రిగిన ‘యువ‌తుల‌పై దాడుల‌ ఘ‌ట‌న‌’ల‌పై మ‌రోసారి స్పందించిన‌ షారుక్ ఖాన్ మహిళల‌తో మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాల‌ని అన్నాడు. ఓ ప‌త్రిక‌కు తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... పిల్ల‌ల్ని త‌ల్లిదండ్రులు హ‌ద్దుల్లో ఉంచి పెంచాల‌ని సూచించాడు.  త‌న పిల్ల‌ల్ని తాను అలా హ‌ద్దుల్లో పెంచుతున్న‌ట్లు తెలుపుతూ త‌న ఇద్ద‌రు కుమారుల గురించి ప్ర‌స్తావించాడు. అమ్మాయిల‌తో మ‌ర్యాద‌గా మెల‌గాల‌ని, వారిని వేధించ‌కూడ‌ద‌ని త‌న కుమారులు ఆర్య‌న్‌, అబ్‌రామ్‌ల‌కు తాను చెబుతాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఒక‌వేళ త‌మ కుమారులు త‌ప్పు చేస్తే వారి త‌లలు తీసేస్తాన‌ని వ్యాఖ్యానించాడు. స్త్రీల‌ను గౌర‌వించాల‌ని తాను త‌మ‌ పిల్ల‌ల‌కు నేర్పుతున్నట్టు పేర్కొన్నాడు. ఆడ‌వారితో మాట్లాడేట‌ప్పుడు వారిని నువ్వు, గివ్వు అని అన‌కూడ‌ద‌ని ఆర్య‌న్‌కు గ‌ట్టిగా చెప్పిన‌ట్లు తెలిపాడు.
sharukh khan

More Telugu News