ఫెమినిస్ట్ పదాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: అనుష్కశర్మ
వాస్తవం చెప్పాలంటే ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోందని, అందుకే వాళ్ల హక్కుల కోసం ఫెమినిస్టులు పోరాడుతున్నారని అనుష్క శర్మ పేర్కొంది. తన విషయానికి వస్తే మాత్రం తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటానని చెబుతోంది. తనలాగే మిగిలిన మహిళలు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని, స్త్రీ, పురుషుల్లో ఒకరిని ఎక్కువ చేయకూడదని తన అభిప్రాయాన్ని తెలిపింది.