Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారులో యువతి.. ఆమె ముందు పాము.. ఆమెతో పాటే ప్రయాణించింది!

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నుంచి కారులో ముండూ ఐలాండ్‌ స్టేషన్‌కు బయలుదేరిన శాలీ గ్రండీ అనే మ‌హిళ ముందు ఒక్క‌సారిగా పాము ద‌ర్శ‌న‌మిచ్చింది. కారు ఇంజిన్‌ లోంచి మెల్ల‌గా వ‌చ్చిన‌ ఓ నల్లటి పామును అతి ద‌గ్గ‌ర‌గా చూసిన ఆమె ఒక్క‌సారిగా వ‌ణికిపోయింది. కారు ముందు అద్దం లోంచి ఆ పాము ఆమెనే చూస్తూ ఉండిపోయింది. ఆ స‌మ‌యంలో ఆ మహిళ ఒంటరిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణిస్తోంది. ఊహించ‌ని ఘ‌ట‌న‌తో ఏం చేయాలో తోచ‌ని ఆమె దానినలా చూస్తూనే మరో గంట సేపు ఆ కారుని అలాగే ముందుకు నడిపింది.

ఇంతలో ఆ మహిళకు దారిలో ఓ పొలం క‌నిపించింది. ఆ పొలంలోకి ఆ పాము వెళ్లిపోతుందేమోన‌ని కొద్ది సేపు కారుని ఆపింది. అయితే, ఆ పాము ఆ కారుదిగి వెళ్ల‌లేదు. దీంతో ఆ పాముతోనే త‌న‌ గమ్యానికి చేరుకుంది. ఆ రోజు ఉదయం వరకు ఆ పాము ఆమె కారులోనే ఉంది. ఆ పాము త‌న‌ ఇంజనులో ఉన్న‌ప్పుడు తీసిన ఓ ఫొటోతో పాటు తాను తీసిన ఓ వీడియోను స‌ద‌రు మ‌హిళ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.
snake

More Telugu News