చిరంజీవి 'ఖైదీ' ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం లేదు.. ధ్రువీకరించిన అల్లు అరవింద్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి 'ఖైదీ' ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం లేదు.. ధ్రువీకరించిన అల్లు అరవింద్!

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలంతా తరలిరానున్నారు. అయితే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే సందేహం మెగా అభిమానుల మెదడును తొలచివేస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని చెప్పారు. 

More Telugu News