పాతనోట్లతో వచ్చే ఎన్ఆర్ఐ లకు ‘కస్టమ్స్’ అనుమతి తప్పనిసరి: ఆర్బీఐ

02-01-2017 Mon 17:08 | Both States
రద్దయిన పెద్దనోట్లతో ఇక్కడికి వచ్చే ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) ఆయా విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల నుంచి అనుమతి పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ నిబంధనలు 2015 ప్రకారం, ఒక వ్యక్తి కేవలం రూ.25 వేల విలువైన పాతనోట్లు మాత్రమే మార్చుకునే అవకాశం ఉందన్నారు. సదరు ధ్రువీకరణ పత్రాన్ని నిర్దేశిత ఆర్బీఐ శాఖల్లో చూపి పాతనోట్లను ఎన్ఆర్ఐ లు జమ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.

అయితే,  నేపాల్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో ఉంటున్న ఎన్ఆర్ఐలకు ఈ సౌకర్యం వర్తించదు. ఎన్ఆర్ఐ లు తెచ్చే పాత నోట్లను లెక్కించి, ఆయా పత్రాల్లో పొందుపరచిన అనంతరం స్టాంప్ వేయాలని కస్టమ్స్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.  కాగా, నోట్ల రద్దు ప్రకటన అమల్లోకి వచ్చిన నాటి నుంచి విదేశీ పర్యటనలో ఉండి గత ఏడాది డిసెంబర్ 30 లోపు నగదు మార్పిడి చేసుకోలేని భారతీయులు ఈ ఏడాది మార్చి 31 వ తేదీలోగా మార్చుకోవచ్చు.

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more