పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర.. విమాన ఇంధన ధరలు కూడా!

01-01-2017 Sun 17:28 | National
ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఫ్‌) ధరతో పాటు ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మ‌రింత పెరిగింది. విమాన ఇంధన ధరలు ఇప్పుడున్న దానికి 8.6 శాతం పెర‌గ‌గా, సిలిండర్‌ ధర రూ.2 పెరిగింది. ఏడు నెలల కాల‌వ్య‌వ‌ధిలో గ్యాస్ ధ‌ర‌ ఇప్పటికీ ఎనిమిదిసార్లు పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం రూ.432.71గా ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.434.71కి చేరుకుంది. ఈ ఏడాది జూన్‌లో గ్యాస్‌పై సబ్సిడినీ తగ్గించాలని కేంద్ర స‌ర్కారు తీసుకున్న‌ నిర్ణయం కార‌ణంగా ఇప్పుడు ధరలు పెరుగుతూ వ‌స్తున్నాయి. ప్రతీ నెల ఒక‌టో తారీఖున  ఏటీఎఫ్‌ గ్యాస్‌ సబ్సిడీని ఫారెన్‌ ఎక్స్ఛేంజీ రేటు ఆధారంగా పెంచుతూ వ‌స్తున్నారు.

గ్యాస్‌, కిరోసిన్‌పై సబ్సిడీలను తొలగించేందుకు డీజిల్‌ విధానాలనే అనుసరించాలని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంలో భాగంగా ప్రస్తుతం ధ‌ర‌ల‌ను పెంచారు. కిరోసిన్‌ ధరలను కూడా ప్ర‌తి ఏడాది 0.25 పైసలు పెంచాలని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ముంబయిలో కిరోసిన్ ధ‌ర లీట‌రుకి రూ.18.28గా ఉంది. మ‌రోవైపు ఢిల్లీని కిరోసిన్‌ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. దీంతో అక్క‌డ స‌బ్సిడీ కిరోసిన్ అమ్మ‌కాలు ఆగిపోయాయి.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more