జయలలిత కాళ్లను తొలగించారా?: సోషల్ మీడియాలో న్యూస్ వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయలలిత కాళ్లను తొలగించారా?: సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రెండు కాళ్లను తొలగించారంటూ ఒక వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఊపిరితిత్తుల సమస్యతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయినైన జయలలిత 75 రోజుల చికిత్స అనంతరం కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పలు అనుమానాలు రేగుతుండగా, సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సాక్ష్యంగా చూపిస్తూ ‘అమ్మ’ రెండు కాళ్లను తొలగించారన్నది ఆ కథనం సారాంశం. జయలలిత ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సమయంలో ఆమె ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమె మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

More Telugu News