బ్యాంకుల్లోనే డ‌బ్బులు ఇస్తున్న అధికారులు.. ఇంకా దిష్టిబొమ్మ‌ల్లానే ఏటీఎంలు

31-12-2016 Sat 08:38 | National
నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించి 50 రోజులు గ‌డిచిపోయినా దేశంలో మూడింట రెండొంతుల ఏటీఎంలు ఇంకా ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. రిజ‌ర్వు బ్యాంకు నుంచి బ్యాంకు బ్రాంచుల‌కు అందుతున్న సొమ్మును సిబ్బంది ఏటీఎంల‌లో పెట్ట‌కుండా నేరుగా బ్యాంకుల్లోనే పంపిణీ చేస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. దేశంలో ప‌నిచేస్తున్న ఏటీఎంల సంఖ్య 66 వేలు మాత్ర‌మేన‌ని కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఏటీఎం ఇండ‌స్ట్రీ(సీఏటీఎంఐ) అధ్య‌క్షుడు సంజీవ్ ప‌టేల్ తెలిపారు.  సీఏటీఎంఐ ప్ర‌కారం దేశంలోని 2.2 ల‌క్ష‌ల ఏటీఎంల‌లో కేవ‌లం 20 శాతం ఏటీఎంల‌లోనే క్ర‌మం త‌ప్ప‌కుండా న‌గ‌దు నింపుతున్నారు.


నిజానికి ప్ర‌తి ఏటీఎంలో రోజుకు రూ.7-8 ల‌క్ష‌లు నింపాల్సి ఉండ‌గా రూ.2-3 ల‌క్ష‌లు మాత్ర‌మే పెడుతున్నారు. దీనికి తోడు పెద్ద మొత్తంలో డ‌బ్బులు డ్రా చేసేందుకు ఖాతాదారులు బ్యాంకుల‌కు వెళ్తుండ‌డంతో బ్యాంకు సిబ్బంది ఏటీఎంల‌లో డ‌బ్బులు నింపేందుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఎన్సీఆర్ కార్పొరేష‌న్(ఇండియా అండ్ సౌత్ ఆసియా) ఎండీ న‌వ్‌రోజ్ ద‌స్తుర్ తెలిపారు. బ్యాంకుల్లో ఒక్క వినియోగ‌దారుడికి ఇచ్చే సొమ్మును ఏటీఎం ద్వారా ప‌దిమందికి పంపిణీ చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మాత్రమే ఏటీఎంల‌లో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌గ‌దు నింపుతోంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం త‌మ ఖాతాదారుల‌కు బ్యాంకుల్లోనే న‌గ‌దును పంపిణీ చేస్తున్నాయ‌ని ద‌స్తుర్ వివ‌రించారు.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more