రేపు ప్ర‌ధాని జాతిని ఉద్దేశించి ఏం చెబుతారంటే... మొదలైన ఊహాగానాలు!

30-12-2016 Fri 06:45 | National
నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించిన రోజు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేపు(శ‌నివారం) మ‌రోమారు ప్ర‌సంగించ‌నున్నారు. ప్ర‌ధాని మ‌రోమారు జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నార‌న్న ప్ర‌క‌ట‌న రాగానే దేశ‌వ్యాప్తంగా మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధాని ఏం మాట్లాడబోతున్నారు? అన్న చ‌ర్చ మొదలైంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డానికి మోదీ అడిగిన‌ 50 రోజుల గ‌డువు నేటి రాత్రితో ముగియ‌నున్న నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి ఆయ‌న  ప్ర‌సంగం ఉంటుంద‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు తెలిపారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించడంతోపాటు భ‌విష్య‌త్తులో చేప‌ట్టే చ‌ర్య‌ల గురించి ప్ర‌ధాని మోదీ మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే  నోట్ల ర‌ద్దుతో సాధించిన విజ‌యాలతోపాటు న‌ష్టాల‌ను కూడా వివ‌రిస్తార‌ని స‌మాచారం. అలాగే ప్ర‌జ‌ల‌కు బోల్డ‌న్ని తాయిలాలు ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌సంగంలో ఐదు కీల‌క అంశాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని  స‌మాచారం. ఆ ఐదు ఇవే..

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం కొత్త‌గా రూ.2 వేల నోట్ల‌ను చలామ‌ణిలోకి తెచ్చింది. ఇప్పుడీ నోట్ల‌ను కూడా ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టిస్తారు. అలాగే  రూ.వంద లోపు ఉన్న చిన్న‌నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు రావాల‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రెండోది.. రైతుల పంట రుణాల‌ను  పూర్తిగా ర‌ద్దు చేయ‌డం. మూడోది జీరో బ్యాలెన్స్ ఉన్న‌ జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో రూ.10 వేలు జ‌మ‌చేయ‌డం, నాలుగోది న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌పై  ప్ర‌స్తుత‌మున్న ఆంక్ష‌లు ఎత్తివేయ‌డం, చివ‌రిది బినామీ ఆస్తుల‌పై తీసుకునే చర్య‌ల విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more