‘బెర్చ్’ ఉద్యోగులకు బోనస్ గా విహారయాత్ర !

28-12-2016 Wed 17:50 | International
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న వాటర్లూ లో ప్రముఖ ఫర్నిచర్ తయారీ సంస్థ ‘బెర్చ్’ తమ ఉద్యోగులకు ‘బోనస్’ ప్రకటించింది. అయితే, ఈ ‘బోనస్’ను క్యాష్ రూపంలో కాకుండా, విహారయాత్ర రూపంలో వారికి అందించాలని భావించింది. ఆ విహారయాత్ర కూడా సాదాసీదాది కాదు. క్రూజ్ ఓడలో కరిబియన్ ద్వీపాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ‘బెర్చ్’ సహ యజమాని గ్యారీ బెర్చ్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి 8న తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 మంది ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారన్నారు.

అక్కడి నుంచి క్రూజ్ ఓడలో ప్రయాణించి కరిబియన్ ద్వీపాలకు వెళతామని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత తమ సంస్థ లాభాలబాట పట్టిందని, ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, సరదాగా గడిపేందుకే ఈ విహార యాత్రను ప్లాన్ చేశామని చెప్పారు. కాగా, 1977లో నెలకొల్పిన ‘బెర్చ్’కు, ఫర్నిచర్ రంగంలో, ముఖ్యంగా అమెరికాలో మంచి గుర్తింపు ఉంది. 1989లో ఒకసారి తమ సంస్థ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత సదరు సంస్థ నష్టాల బాట పట్టింది. అయితే,  చాలా సంవత్సరాల తర్వాత ‘బెర్చ్’ లాభాలను ఆర్జించడంతో ఉద్యోగుల కోసం ఈ విహారయాత్రను ఏర్పాటు చేసింది. 

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more