‘రద్దయిన నోట్లు క‌లిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష‌’.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో...!

28-12-2016 Wed 12:47 | National
న‌ల్ల‌ధ‌నంపై ఉక్కుపాదం మోపిన కేంద్ర ప్ర‌భుత్వం దాన్ని సమూలంగా రూపుమాపాల‌నే ఉద్దేశంలో ఏ మాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. బ్యాంకులో జమ చేయకుండా గడువు తీరిన తర్వాత కూడా ర‌ద్ద‌యిన నోట్లను క‌లిగిన ఉన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందుకోసం అత్య‌వ‌స‌ర ఆదేశం జారీ చేయడానికి ఈ రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది.

తాము తీసుకురావాల‌నుకుంటున్న‌ ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. త్వ‌ర‌లోనే ఈ ఆర్డినెన్స్‌ను  రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ వ‌ద్ద‌కు పంపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన నోట్లు కలిగి ఉంటే నేరంగా ప‌రిగ‌ణించి చ‌ర్య‌లు తీసుకోనున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 31 త‌రువాత పాత‌నోట్లు క‌లిగి ఉండి ప‌ట్టుబ‌డితే నాలుగేళ్ల జైలు శిక్ష విధించ‌నున్నారు. అలాగే పాత నోట్ల‌తో లావాదేవీలు జ‌రిపితే రూ.5 వేల జ‌రిమానా విధించ‌నున్నారు.

అలాగే, రద్దయిన పెద్ద‌నోట్ల‌ను ఈ నెల 30 త‌రువాత రిజ‌ర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కౌంటర్ల ద్వారానే మార్చుకోవాల‌ని, అందుకోసం కేవైసీ ఫారాలు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పాత‌నోట్లు జ‌మ‌ చేసుకోవాలంటే అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ప్ర‌జ‌లు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. కాగా, న‌గ‌దుర‌హిత లావాదేవీలతో కాకుండా న‌గదుతో మాత్ర‌మే వ్యాపారాలు చేసే వారిపై కూడా ప‌లు ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

demonitisation

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more