విఫలమైన కోహ్లీ.. బ్యాటు ఝళిపించిన టీమిండియా కేఎల్ రాహుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విఫలమైన కోహ్లీ.. బ్యాటు ఝళిపించిన టీమిండియా కేఎల్ రాహుల్

చెన్న‌య్ వేదిక‌గా జ‌రుగుతున్న చివ‌రివ‌న్డేలో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ బ్యాటు ఝళిపిస్తున్నాడు. క్రీజులో పాతుకుపోయి సెంచ‌రీ సాధించాడు. ప్ర‌స్తుతం 169 ప‌రుగుల‌తో చ‌క్క‌ని షాట్లు ఆడుతూ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు విసుగు తెప్పిస్తున్నాడు. మ‌రో ఓపెన‌ర్ పార్థివ్ ప‌టేల్ 71 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌యిన విష‌యం తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ఛ‌టేశ్వ‌ర పుజారా 16 ప‌రుగుల‌కే వెనుదిర‌గ‌గా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 15 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరుకే అవుట‌య్యాడు. ఈ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన నాయ‌ర్ 46 ప‌రుగులు చేసి అర్ధ‌సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ్రాడ్, అలీ, స్టోక్స్ ల‌కు త‌లో వికెట్ ద‌క్కాయి. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు  319 (90 ఓవ‌ర్ల‌కు)గా ఉంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.


kl rahul

More Telugu News