రాహుల్ పై వరుస ట్వీట్లు సంధించిన కేజ్రీవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ పై వరుస ట్వీట్లు సంధించిన కేజ్రీవాల్

మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు ఉంటే వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మోదీ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అయితే తనను పార్లమెంటులో మాట్లాడనీయడం లేదని రాహుల్ చేసిన ఆరోపణలపై కేజ్రీవాల్ వరుస ట్వీట్లు సంధించారు. అగస్టా వెస్ట ల్యాండ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్; సహారా, బిర్లా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.

 అందుకే ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తమ ఓట్లతో గెలుపొందిన బీజేపీ తమను దొంగలంటోందని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయని ఆయన తెలిపారు. పార్లమెంటులో మాట్లాడే అనుమతి లభించకపోతే ప్రజల ముందు సాక్ష్యాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
kejriwal demands rahul

More Telugu News