రాజ్ కోట్ వేదికగా తొలిటెస్టులో సెంచరీల మోత మోగింది. తొలి రెండు రోజులు ఇంగ్లండ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కగా, మూడో రోజు భారత్ రెండు సెంచరీలతో దీటుగా సమాధానమిచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 537 పరుగులవద్ద ఇన్నింగ్స్ ముగించింది. దీంతో రెండో రోజు టీమిండియా 63 పరుగులు చేసింది. ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. గంభీర్ కేవలం 29 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అనంతరం మురళీ విజయ్ కు జతకలిసిన హోం బాయ్ ఛటేశ్వర్ పూజారా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. దీంతో గంభీర్ అవుటైన అనంతరం బ్యాటింగ్ కు దిగినా మురళీ విజయ్ కంటే ముందుగా సెంచరీ సాధించాడు.
అనంతరం దూకుడు మరింత పెంచే క్రమంలో కెప్టెన్ కుక్ కు సెకెండ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి 124 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం కొద్దిసేపట్లో మూడోరోజు ఆటముగిస్తుందనగా విజయ్ ఆడిన బంతిని హమీద్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 126 పరుగుల వద్ద టీమిండియా మురళీ విజయ్ వికెట్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. దీంతో కోహ్లీకి జతగా అమిత్ మిశ్రాను బ్యాటింగ్ కు పంపారు. క్రీజులో దిగిన మిశ్రాకు కోహ్లీ సూచనలు చేశాడు. అయితే ఆడిన రెండోబంతికే మిశ్రా అవుటవ్వడం విశేషం. అచ్చం మురళీ విజయ్ ఎలా అవుటయ్యాడో అదే రీతిన మిశ్రాను హమీద్ ఒడిసిపట్టేశాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 108.3 ఓవర్లలో 319 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఇంగ్లండ్ కంటే ఇంకా 218 పరుగులు వెనకబడింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, అన్సారీ, రషీద్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన