పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో 500, 1000 రూపాయలు తీసుకోమని చెప్పిన ఓ ఆసుపత్రికి ఓ వ్యక్తి 40 వేల రూపాయలను నాణేల రూపంలో చెల్లించిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సుకంత చౌ అనే యువతి రెండు రోజుల క్రితం డిశ్చార్జి కావాల్సి ఉండగా, వారికి ఆసుపత్రి రూ.40,000 బిల్లు వేసింది. అయితే, ఆమె బంధువు వద్ద అన్నీ 500, 1000 రూపాయల నోట్లే ఉన్నాయి.
ఆసుపత్రి సిబ్బంది వాటిని తీసుకోమని చెప్పేశారు. అతడి వద్ద క్రెడిట్ కార్డు కూడా లేకపోవడంతో చెక్కు రూపంలో బిల్లు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, దానికి కూడా సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో ఆయన తన బంధువుని ఆసుపత్రి నుంచి తీసుకురావడానికి డబ్బు కావాలంటూ తన బంధువులకి, తెలిసిన వారికి వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టాడు. స్పందించిన ఆయన బంధువులు వారి వారి పిల్లల కిడ్డీ బ్యాంకుల్లోనూ, ఇళ్లలోనూ దాచుకున్న చిల్లర అంతా తీసి మొత్తం రూ.40,000 నాణేలు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఒక్కసారిగా అంత చిల్లర చూడగానే షాకై పోయిన ఆసుపత్రి సిబ్బంది చిల్లర తీసుకోమని చెప్పారు. అతడిని డీడీ ఇవ్వాలని కోరారు. ఇంత కష్టపడి డబ్బు తీసుకొస్తే తీసుకోరా? అని అతడి బంధువులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ చిల్లర డబ్బులే తీసుకుంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన