పాత కరెన్సీని రద్దు చేస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నేతలు, తమ వద్ద ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న నల్లధనాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు తరువాత ఓటేయాలని చెబుతూ కరెన్సీని పంచుతున్నారు. ఈ డబ్బును తీసుకువెళ్లి బ్యాంకుల్లో మార్చుకుని ఖర్చు పెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో తమకు ఓటు వేయాలని ఇప్పుడే అభ్యర్థిస్తున్నారు. గత రెండు రోజులుగా యూపీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ తంతు కనిపిస్తోంది.
వాస్తవానికి పాత కరెన్సీని రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తరువాత, ఎన్నికల రాష్ట్రాల్లోని నేతలకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. వీరంతా కోట్ల కొద్దీ డబ్బును ఎన్నికల్లో వెచ్చించేందుకు సిద్ధం చేసుకుని ఉండటమే ఇందుకు కారణం. ఒకరోజుల్లా వారిలో ఆందోళన నెలకొన్నా, ఆపై సర్దుకుని, తమ వద్ద ఉన్న డబ్బంతా అనుయాయులకు పంపి, వారి నుంచి ఓటర్లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరాఖండ్, గోవాల్లో సైతం ఓటర్లకు ఇప్పుడే డబ్బులు పంచుతున్నట్టు సమాచారం.
తమ వద్ద ఉన్న డబ్బు ఎన్నికల నాటికి ఎలానూ పనికిరాదని, దాన్ని తాము బయటకు చూపలేమని భావిస్తున్న నేతలు, డబ్బును నీళ్లలా పంచే పనిలో నిమగ్నమై ఉన్నారు. గ్రామాల ఇన్ చార్జులు, పార్టీ నేతలు, సర్పంచ్ ల ద్వారా ఈ డబ్బు పంపిణీ జోరుగా సాగుతోంది. ఇక ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఓటరు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల వరకూ డబ్బిచ్చిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓటేస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే!
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన