అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం చాలా మంది అమెరికన్లకు ఆవేదన మిగిల్చింది. ట్రంప్ తమ అధ్యక్షుడు కాదంటూ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఎక్కువ ఓట్లు వచ్చిన కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరసనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న వేర్పాటువాదం ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోవాలని అక్కడ చాలా మంది భావిస్తున్నారు.
'ఎస్ కాలిఫోర్నియా' అనే బృందం దీనికి సంబంధించి బుధవారం నాడు ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. 2020 నాటికల్లా అమెరికా నుంచి విడిపోయి, కొత్త దేశంగా కాలిఫోర్నియా ఆవిర్భవించడమే తమ లక్ష్యమని ఆ సందర్భంగా వారు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాలిఫోర్నియా అని... ఫ్రాన్స్ కంటే కాలిఫోర్నియానే శక్తిమంతమైనదని... పోలండ్ దేశం కంటే కాలిఫోర్నియా జనాభానే ఎక్కువని వారు అంటున్నారు. కాలిఫోర్నియా దేశాలతో పోటీపడుతుందే కాని... అమెరికాలోని మిగిలిన 49 రాష్ట్రాలతో కాదని చెబుతున్నారు. కాలిఫోర్నియా విలువలతో సంఘర్షించే విధానాలను అమెరికా ప్రభుత్వం అమలు చేస్తోందని వారు మండిపడుతున్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెలుపలకు రావడాన్ని 'బ్రెగ్జిట్' అంటున్నారు. ఇదే విధంగా అమెరికా నుంచి కాలిఫోర్నియా బయటకు రావాలనుకుంటున్న దాన్ని 'కాల్ ఎగ్జిట్'గా ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటున్నారు. మరోవైపు... యూఎస్ నుంచి టెక్సాస్ రాష్ట్రం కూడా విడిపోవాలనుకుంటోంది. దీన్ని 'టెగ్జిట్' గా పిలుస్తున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన