నేటి నుంచి బ్యాంకుల్లో పాత కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చని భావించి బ్యాంకులకు పెద్ద మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్లాలని భావిస్తున్నారా? బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే ప్రతి రూపాయిపైనా ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నవారు (వార్షికాదాయం రూ. 2.5 లక్షలు) బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే భయపడాల్సిన అవసరం లేదని, పన్ను పరిధిలో ఉన్నవారు వేసే ప్రతి రూపాయినీ ఐటీ రిటర్నుల దాఖలుతో సరిపోల్చి చూస్తామని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా వెల్లడించారు
ఖాతాదారు ఐటీ రిటర్నుల సమయంలో వెల్లడించిన వివరాలతో తాజా డిపాజిట్లు సరిపోలకుంటే, అది పన్ను ఎగవేతేనని, 200 శాతం పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు. మహిళలు రూ. 2.5 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకేసారి 2 లేదా 3 లక్షల రూపాయలు అంతకుమించిన డబ్బును డిపాజిట్ చేసేందుకు తెస్తే, వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తుందని అన్నారు. డిసెంబర్ 30 వరకూ రెండున్నర లక్షలకు పైబడిన అన్ని డిపాజిట్ల వివరాలనూ నిశితంగా పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం నగదు మార్పిడికి నాలుగు వారాల వరకూ సమయం పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు వివరాలు సమర్పించేవారిని చట్టం ముందు నిలిపి జరిమానాలు విధించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన