దోపిడీకి వచ్చిన దొంగలు చేసిన దారుణానికి సౌదీ అరేబియాలోని జెద్దా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జెడ్డాలోని ఓ నివాసంలోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఆ నివాసంలోని 10 వేల రియాళ్లు, 8 మొబైల్ ఫోన్లు దొంగిలించి పారిపోయారు. వస్తువులు పోయాయని ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉండగానే వెనక్కి వచ్చిన నలుగురు దొంగలు, ఇంటి యజమాని, అతని కుమార్తెను విద్యుత్ తీగలతో బంధించారు. భర్త, కుమార్తె కళ్లముందే అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కఠిన శిక్షలు అమల్లో ఉండే సౌదీలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు. దీంతో దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం దోషులకు ఏకంగా 52 ఏళ్ల జైలు శిక్ష, 7,000 కొరడా దెబ్బలను శిక్షగా విధించింది. ఒకరికి 50 దఫాలుగా 2,500 కొరడా దెబ్బలతో పాటు 17 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. మరో ఇద్దరికి 1,500 చొప్పున కొరడా దెబ్బలతో పాటు 15 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. నాలుగో వ్యక్తికి 1,500 కొరడా దెబ్బలు, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన