తాము చట్టాలను ఉల్లంఘించి సినిమా రూపొందించలేదు కనుక, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అఖ్తర్ తెలిపాడు. పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన నేపథ్యంలో రయీస్ ను విడుదల చేస్తారా? లేదా కరణ్ జొహర్ లా ఎమ్మెన్నెస్ తో ఒప్పందం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఫర్హాన్, ‘రయీస్’ను అనుకున్న సమయానికే ధైర్యంగా విడుదల చేస్తామని అన్నాడు.
‘రయీస్’లో షారూక్ ఖాన్ సరసన పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు, చట్టాలు ఉల్లంఘిస్తే భయపడాల్సిన అవసరం ఉంటుందని, తాము అలాంటి పనులేవీ చేయలేదని స్పష్టం చేశాడు. దీని గురించి అంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదని అన్నాడు. సహ నిర్మాత రితేశ్ సిధ్వానీ మాట్లాడుతూ, సినిమా విడుదల గురించే ఆలోచిస్తున్నామని, అది మినహా మరింకే విషయం గురించి ఆలోచించడం లేదని అన్నాడు. త్వరలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన