‘నా 16వ పుట్టినరోజు నాకు అత్యంత బాధాకరమైనది’ అని ప్రముఖ నటుడు కమలహాసన్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కమల్, తాను వేరుపడ్డట్లు గౌతమి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘62వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మీకు ఈ పుట్టినరోజు అత్యంత బాధాకరమైనదా?' అనే ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ, ‘కాదు, ఎందుకంటే, నా 16వ పుట్టినరోజు సమయానికి నాకు ఒక లక్ష్యం, దిశా నిర్దేశం లేకుండా ఉన్నాను. అప్పుడు, మా నాన్నగారు నాకు క్లాసు పీకారు. నాకు బాగా గుర్తుంది.. నా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని గట్టిగా ఏడ్చాను. నా పుట్టినరోజు నాడు నేను ఏడ్చినటువంటి ఒకే ఒక సందర్భం ఇది. అందుకే బాగా అన్ హ్యాపీ పుట్టినరోజది’ అంటూ నాటి విషయాలను కమల్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తన కాలికి మల్టీ ఫ్యాక్చర్ కారణంగా తీవ్రంగా బాధపడుతున్నానని, నిన్నటి నుంచి నరాలకు సంబంధించి కూడా ఇబ్బంది మొదలైందని, ఈ బాధ తట్టుకోలేకపోతుండటంతో వైద్యుడి సలహాతో రోజులో ఎక్కువ భాగం మత్తు మందులు వేసుకోకతప్పడం లేదన్నారు. ఒకవైపు కాలి బాధ, మరోవైపు బయట తిరగలేకపోతున్నాననే బాధగా ఉందన్నారు. ‘సరిగా నడవలేకపోతున్న నేను ఒక కాలితో కుంటుతూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం బాగుండదు. దాని బదులు నా గదిలో కూర్చోవడం మంచిది. అందుకే నా పుట్టినరోజు వేడుకలను నిర్వహించటం లేదు. వేరే కారణాలు ఏమీ లేవు’ అంటూ కమల్ చెప్పుకొచ్చారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన