ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ తన పేరుకు బదులుగా వేరే పేరుతో ఇటీవల బస్తర్ లో తిరిగారని, ఆమెపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు అంటున్నారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ ఎస్ఆర్ పీ కల్లూరి మాట్లాడుతూ, ఈ ఏడాది మేలో మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో పర్యటించేందుకు ఒక బృందాన్ని పంపారని, ఆ బృందంలో ఢిల్లీ యూనివర్శిటీలో సోషియాలజీ డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నందిని సుందర్ కూడా ఉన్నారన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఆమెను ప్రశ్నించగా తన అసలు పేరుకు బదులు వేరే పేరు చెప్పిందని, ఆమెతో పాటు వచ్చిన బృందం కూడా అడవిలో తిరిగారని, వారు కూడా తప్పుడు పేర్లతో అక్కడి హోటళ్లలో, రెస్ట్ హౌస్ లో విడిది చేశారని ఆరోపించారు.
అంతేకాకుండా, గత వారం సుక్మా జిల్లాలో ఒక గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారని, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నందిని సుందర్, మరికొందరిపై మర్డర్ కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నందినీ సుందర్ ఖండించారు. పోలీసుల అరాచకాలను బయటపెడుతున్న రీసెర్చి స్కాలర్లు, జర్నలిస్టులు, లాయర్లు, యాక్టివిస్ట్ లపై వారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన