ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ఆర్థిక స్తోమత లేని వారి కోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. ‘దివ్య దర్శనం’ పేరుతో పేదలను పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి ఈ పథకం వర్తిస్తుంది. తిరుమల- తిరుపతి, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంతోపాటు మరికొన్ని క్షేత్రాలకు పేదలను తీసుకెళ్తారు.
ఏటా ఒక్కో జిల్లా నుంచి పదివేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దర్శనం, తీర్థప్రసాదాల బాధ్యత కూడా దేవాదాయ శాఖే తీసుకుంటుందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి భక్తులను ఎంపిక చేస్తామని, ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని తీసుకుళ్లే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే ఒక్కో మండలం నుంచి లాటరీ ద్వారా 200 మందిని ‘దివ్య దర్శనం’ కోసం ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఇందుకు అర్హులు. త్వరలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన