అనారోగ్యంతో మృతి చెందిన భార్యను సొంతూరుకు తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వలేని ఓ వ్యక్తి ఆమె మృతదేహంతో 60 కిలోమీటర్లు నడిచిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మాఝుకోడ్‌కు చెందిన రాములు(53), కవిత(45) భార్యాభర్తలు. ఇద్దరూ కుష్టు వ్యాధి బాధితులే. బతుకు తెరువు కోసం ఉన్న ఊరును వదిలిన వారు కొంతకాలంగా కర్ణాటకలోని బీదర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలిలో ఉన్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఒకటి ప్రతినెలా యాచకులకు ఐదు కిలోల బియ్యం ఇస్తుందని తెలుసుకున్న దంపతులు శుక్రవారం రాత్రి బీదర్ నుంచి షిర్డీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి లింగంపల్లిలో దిగారు.
ఉదయం మౌలాలి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా భార్య కవిత అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. కళ్లముందే భార్య చనిపోవడంతో రాములు కన్నీరుమున్నీరుగా విలపించాడు. భార్య మృతదేహానికి సొంతూరులోనే అంతక్రియలు నిర్వహించాలని అనుకున్నాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో ఓ యాచకుడిని అడిగి చక్రాలున్న తోపుడుబండిని తీసుకున్నాడు. దానిపై భార్య మృతదేహాన్ని ఉంచి మాఝుకోడ్‌కు బయలుదేరాడు. అలా 60 కిలోమీటర్లు బండిని తోసుకుంటూ వికారాబాద్ చేరుకున్నాడు.
వికారాబాద్ వాసులు కొందరు గమనించి రాములను ఆరా తీశారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ రవి.. రాములు అంగీకరిస్తే మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేస్తామని చెప్పారు. దీనికి రాములు అంగీకరించలేదు. సొంతూరులోనే అంత్యక్రియలు నిర్వహిస్తానని చెప్పడంతో అక్కడున్న వారు తలా కొంత సాయం చేశారు. సీఐ రవి.. స్వామి వివేకానంద సేవా సమితి అంబులెన్స్ ద్వారా వారిని సొంతూరుకు పంపే ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో రాములు అంబులెన్సులో సొంతూరు చేరుకున్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన