అవార్డుపై స్పందించని బాబ్ డిలాన్ తీరు అహంభావ పూరితమన్న నోబెల్ కమిటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవార్డుపై స్పందించని బాబ్ డిలాన్ తీరు అహంభావ పూరితమన్న నోబెల్ కమిటీ

ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభిస్తే, ఎగిరి గంతేసి ఆ సంతోషాన్ని అందరితో పంచుకునే వారినే మనం చూశాం. కానీ అమెరికన్ జానపద గాయక రచయిత బాబ్ డిలాన్ మాత్రం అందుకు విరుద్ధం. సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి ప్రకటించినా, ఇంతవరకూ స్పందించలేదు. ఆయన్ను సంప్రదించాలని నోబెల్ కమిటీ చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలకు సమాచారం పంపిన నోబెల్ కమిటీ, ఆయన స్పందించని వైఖరి అహంభావ పూరితమని విమర్శించింది. నోబెల్ కమిటీతో బాబ్ డిలాన్ అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ సభ్యుడు పర్ వాస్ట్ బర్గ్ వ్యాఖ్యానించారు. ఆయన తీరును ముందుగానే తాము ఊహించామని తెలిపారు.

More Telugu News