పవన్ కల్యాణ్ సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రమది: వరుణ్ తేజ్
ప్రముఖ నటుడు, తన బాబాయి అయిన పవన్ కల్యాణ్ సినిమాల్లో తన ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రం ‘తమ్ముడు’ అని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. ప్రస్తుతం తన కాలికి గాయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుణ్ తేజ్, ఈరోజు తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులు సరదాగా అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్ తేజ్ కూడా అంతే సరదాగా సమాధానమిచ్చాడు.
తనకు ఇష్టమైన బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ అని, తనకు ఇష్టమైన ఆట వాలీబాల్ అని చెప్పిన వరుణ్ తేజ్, తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందించాడు. ‘నాట్.. ఎనీటైమ్.. సూన్’ అంటూ తన పెళ్లి గురించి జవాబిచ్చాడు. ‘వరుణ్ తేజ్.. రూ.500 కు చిల్లర ఉందా?’ అని ఒక అభిమాని అడిగిన సరదా ప్రశ్నకు, ‘ఉంది.. వచ్చి తీసుకో’ అంటూ సందర్భానుసారంగా వరుణ్ స్పందించాడు. అభిమానులు అడిగిన ఇంకా పలు ప్రశ్నలకు వరుణ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.