మీ కరచాలనం చెప్పేస్తుంది...మీరెలా ఉన్నారన్న సంగతిని!
మీ కరచాలనం మీరెలా ఉన్నారన్న సంగతిని చెప్పేస్తుందని వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంత కాలం దృఢంగా కరచాలనం చేసేవారు మానసికంగా దృఢంగా ఉంటారని మానసిక వైద్యులు భావిస్తుండేవారు. తాజాగా వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు వీరు కేవలం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారని నిరూపణ అయిందని చెబుతున్నారు. ఇకపై ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బీపీ చూడడం ద్వారా అంచనా వేయాల్సిన పని లేదని, కరచాలనం ద్వారా నిర్ధారించవచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న నడియా స్టీబర్ చమత్కరించారు.
కొందరి కరచాలనం దూదిని పట్టుకున్నట్టు మెత్తగా స్మూత్ గా ఉంటుందని, అలాంటి వారి కంటే బలంగా పట్టుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని, వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. ఎక్కువ గ్రిప్పు కలిగిన వారి కంటే తక్కువ గ్రిప్పు కలిగిన వారు 70 శాతం ముందుగా మరణిస్తారని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా, కరచాలనం చేసే వారి గ్రిప్పుకు వారి వయస్సుకు, ఎత్తుకు కూడా సంబంధం ఉంటుందని వారు తెలిపారు.