టీడీపీ పరువు తీసిన శిక్షణా తరగతుల ఫోటో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ పరువు తీసిన శిక్షణా తరగతుల ఫోటో!

రాజకీయనాయకుల్లో సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న పేరు ప్రతిష్ఠలు మరే రాజకీయ నాయకుడికి లేవంటే అతిశయోక్తి కాదు. ఏం చేసినా అందులో సాంకేతిక సహకారం ఉండాలని చంద్రబాబు ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు తమ్ముళ్లకు సాంకేతిక అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన పలు ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. ఇందులో గద్దె రామ్మోహన్ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ ఫోటోలో ఆకట్టుకునే అంశం ఏంటంటే... మానిటర్ కూడా ఆన్ చేయకుండా ఆయన శ్రధ్ధగా సాంకేతిక శిక్షణాపాఠాలు వినడం సర్వత్రా విమర్శలపాలవుతోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చేస్తూ...తెలుగు తమ్ముళ్లకు ప్రచారం పిచ్చి ఏ స్థాయిలో ఉందో చూడండంటూ వైరల్ అవుతోంది.

More Telugu News