ఆ నాయకులను విషమిచ్చి చంపండి: ఉగ్రదాడి బాధితులు
భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకులపై ఉరీ ఉగ్రదాడుల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నాయకులకు విషం ఇచ్చి చంపాలని అంటున్నారు. సర్జికల్ దాడులు చేయాల్సింది ఉగ్రవాదుల మీద కాదు, ఇలాంటి నాయకుల మీద ముందు చేయాలని మండిపడ్డారు.
సర్జికల్ దాడుల గురించి ప్రశ్నిస్తున్న నాయకులు దేశ ద్రోహులని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతాదేవి అన్నారు. సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయన్న విషయాన్ని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుల వల్లే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడుతున్నారని ఆరోపించారు. మన సైనికుల నిబద్ధతను ప్రశ్నించడం ఎంతో బాధను కలిగిస్తోందని ఆమె వాపోయారు. నాయకుల మాటలు అమరుడైన సైనికుడి కుటుంబానికి ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు.