భువనేశ్వర్ కుమార్ బెస్ట్ స్వింగ్ బౌలర్: జహీర్ ఖాన్ కితాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భువనేశ్వర్ కుమార్ బెస్ట్ స్వింగ్ బౌలర్: జహీర్ ఖాన్ కితాబు

టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బెస్ట్ స్వింగ్ బౌలర్ అని కామెంటేటర్ గా మారిన వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ ప్రశంసించాడు. న్యూజిలాండ్ తో ఈడెన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ లో భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని కితాబునిచ్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో చెలరేగిన భువనేశ్వర్ కుమార్ కెరీర్ బెస్ట్ బౌలింగ్ నమోదు చేశాడని అన్నాడు. కాగా, ఈ ఇన్నింగ్స్ తో కెరీర్ లో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ కూడా చేరిన సంగతి తెలిసిందే. అతని బౌలింగ్ శైలి బాగుంటుందని జహీర్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ను తాను చూశానని, అందుకే చెబుతున్నానని, ప్రస్తుత పేస్ బౌలర్లలో అత్యుత్తమ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అని జహీర్‌ ఖాన్‌ కొనియాడాడు.

More Telugu News