Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాడీ కావాలా? యాప్ లో ఆర్డర్ చేయమంటున్న ఎన్నారై డాక్టర్ కమల్ అహూజా

గుండు సూది నుంచి లగ్జరీ కారు వరకూ అన్నీ ఆన్ లైన్లో లభిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు కలగని మహిళల కోసం ఓ సరికొత్త యాప్ ను సృష్టించారు లండన్ లోని భారత సంతతి డాక్టర్ కమల్ అహూజా. లండన్ స్పెర్మ్ బ్యాంకు సైంటిఫిక్ డైరెక్టర్ గా కూడా ఉన్న కమల్ అహూజా, 'ఆర్డర్ ఏ డాడీ' పేరిట సరికొత్త యాప్ ను విడుదల చేశారు. తన బిడ్డకు డాడీగా ఎవరుండాలో, ఎలా ఉండాలో ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని, అతని వీర్యాన్ని పంపుతామని చెబుతున్నారు. పూర్తి చట్టబద్ధంగా తయారైన యాప్ ద్వారా డాడీ ఎత్తు ఎంతుండాలి? కళ్లెలా ఉండాలి? జుట్టు ఎలా ఉండాలి? ఎంత వరకూ చదువుకోని ఉండాలి? వంటి ఎన్నో అంశాలను పరిశీలించి డోనర్ ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. 950 పౌండ్లతో తాము కోరుకున్న సంతాన ఉత్పత్తి కేంద్రానికి వీర్యాన్ని పంపుతామని చెబుతున్నారు.

More Telugu News