వీకెండ్ లో నిద్ర బాగా కుమ్మేస్తున్నారా...? అయితే ఉపయోగం లేదట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వీకెండ్ లో నిద్ర బాగా కుమ్మేస్తున్నారా...? అయితే ఉపయోగం లేదట

వారాంతాల్లో చాలా మంది ఎక్కువ సేపు నిద్ర పోవడం సర్వసాధారణం. వారమంతా కష్టపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా నిద్ర పోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని, అలసట దూరం అవుతుందని భావిస్తుంటారు. కాని నిజానికి విశ్రాంతి లభించకపోగా అలసట ఏర్పడుతుందని అంటున్నారు పరిశోధకులు. స్వీడన్ లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై ఓ పరిశోధన నిర్వహించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లో అధిక సమయం పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. దీంతో విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది ఏర్పడుతుందన్నది పరిశోధన సారాంశం. ప్రతి రోజూ నిద్ర విషయంలో ఏ షెడ్యూల్ అయితే పాటిస్తున్నామో దాన్నే వారాంతాల్లోనూ అనుసరించడమే మంచిదన్నది పరిశోధకుల సూచన.

More Telugu News