నేటి ఐపీఎల్ మ్యాచ్ లు
ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. జైపూర్ వేదికగా 4 గంటలకు 'రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' జట్లు తలపడనున్నాయి. అనంతరం 8 గంటలకు ముంబయి వేదికగా 'ముంబయి ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్' జట్లు పోటీపడతాయి. కాగా, నిన్నరాత్రి 'ఢిల్లీ డేర్ డెవిల్స్-పుణె వారియర్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో డెవిల్స్ జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి పాయింట్ల పట్టికలో ఓ అడుగు ముందుకేసింది.