జనసేన బలోపేతానికి చర్యలు!... నెల్లూరులో ‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్’ సర్వసభ్య సమావేశం తీర్మానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జనసేన బలోపేతానికి చర్యలు!... నెల్లూరులో ‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్’ సర్వసభ్య సమావేశం తీర్మానం!

టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ‘జనసేన’ బలోపేతానికి ఆయన అభిమానులు పూనుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు వారంతా కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నెల్లూరులో నిన్న జరిగిన పవన్ కల్యాణ్ అభిమానుల సంఘం సర్వసభ్య సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన సంఘం నేతలు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు టోనీబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా జనసేన తరఫున ప్రజా సమస్యలపై పోరు సాగించేందుకు పవన్ కల్యాణ్ అభిమానులంతా ముందుకు రావాలని ఆయన కోరారు. వచ్చే నెల 2న పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో రక్త దాన శిబిరాలను భారీగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

More Telugu News