పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న క్రిష్‌.. ప్రముఖుల సమక్షంలో ఘ‌నంగా జ‌రుగుతున్న‌ క్రిష్ వివాహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న క్రిష్‌.. ప్రముఖుల సమక్షంలో ఘ‌నంగా జ‌రుగుతున్న‌ క్రిష్ వివాహం

ప్రముఖుల సమక్షంలో సినీ దర్శకుడు క్రిష్ వివాహం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో ఘ‌నంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఎంతోమంది అతిర‌థ మహార‌థులు హాజరవుతున్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతూ క్రిష్ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. క్రిష్‌-ర‌మ్య‌ల వివాహ వేదిక వ‌ద్ద‌కు తెలుగు సినీనటులు అల్లు అర్జున్‌, అక్కినేని నాగ‌చైత‌న్య, త‌ణికెళ్ల భ‌ర‌ణి ఇప్పటికే చేరుకున్నారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. ఆయ‌న పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News