చాలా సీరియస్ మేటర్ ఇది... కాస్త వినండి: కురియన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా సీరియస్ మేటర్ ఇది... కాస్త వినండి: కురియన్

ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ కేవీపీ దాఖలు చేసిన ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ ఓటింగ్ ను తప్పించుకోవాలని చూస్తున్న బీజేపీ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని రేణుకా చౌదరి, కేవీపీలు అడ్డుకున్నారు. ప్రైవేటు మెంబర్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ బిల్లు కాదని కేవీపీ చెప్పగా, మిగతా సభ్యులు సైతం నినాదాలు చేశారు. సభ అదుపుతప్పుతోందని గమనించిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కల్పించుకుని "దయచేసి నా మాట వినండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. నేను చెప్పేది ఆలకించండి. మీరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లు ఇచ్చారు. ఆర్థిక మంత్రికి దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఆయన ద్రవ్య బిల్లుగా భావిస్తున్నారు. మీకేమైనా అనుమానాలుంటే ముందు వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తా. ఇది మనీబిల్లు అవునా? కాదా? అన్న విషయాన్ని నేను నిర్ధారించను. లోక్ సభ ప్రిసైడింగ్ అధికారికే వదిలేద్దాం. ఈ బిల్లు విషయమై తేల్చాలని లోక్ సభకు నిర్ణయాధికారం ఇద్దాం. దయచేసి కూర్చోండి. మీ పద్ధతి బాగాలేదు. మీకు ఈ విషయంలోని తీవ్రత అర్థం కావడం లేదా? ఆర్థిక మంత్రి కొన్ని అంశాలను ఆర్టికల్ 110ను ఉటంకిస్తూ లేవనెత్తారు. ఆర్థిక మంత్రి ప్రసంగం ముగించిన తరువాతనే మిగతా వారికి ఎవరికైనా అవకాశం ఇస్తాను. అందరూ కూర్చోండి" అని అన్నారు.

More Telugu News