లోక్‌స‌భ‌లో ఓవైపు ప్ర‌శ్నోత్త‌రాలు.. మ‌రోవైపు ‘హోదా’ కోసం వైసీపీ సభ్యుల నినాదాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్‌స‌భ‌లో ఓవైపు ప్ర‌శ్నోత్త‌రాలు.. మ‌రోవైపు ‘హోదా’ కోసం వైసీపీ సభ్యుల నినాదాలు

లోక్‌స‌భ‌లో ఈరోజు గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓవైపు ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతుండ‌గా, మ‌రోవైపు వైసీపీ స‌భ్యులు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్ర‌త్యేక హోదాపై, ఇచ్చిన హామీల‌పై కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఎంపీలు ఆందోళ‌న చేశారు. కొంద‌రు ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కలగజేసుకొని, ఎంపీలు ఆందోళ‌న విర‌మించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ స‌మ‌స్య‌ల‌ని కేంద్రం ప‌రిశీలిస్తుంద‌ని చెప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్క‌టిగా నెర‌వేరుస్తున్నామ‌న్నారు.

More Telugu News